
విలక్షణ నటుడు ప్రకాష్ రాజు, బ్రహ్మానందం, అనసూయ కూడా ఈ సినిమాల నటిస్తూ ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చివరిగా కృష్ణవంశీ నక్షత్రం వంటి సినిమాతో భారీ డిజాస్టర్ ను చవిచూశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ సినిమా మరాఠీ మూవీ నట సామ్రాట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు . అయితే ఆర్థిక ఇబ్బందుల కారణాంగా కొంతకాలం మధ్యలో ఈ సినిమా ఆగిపోయింది. ఎట్టకేలకు ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.
ఇటీవల కీలక పాత్రలో డబ్బింగ్ వర్క్ మొదలయ్యింది. ప్రకాష్ రాజ్ తన పోర్షన్ ని పూర్తి చేయగా.. అనంతరం బ్రహ్మానందం కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఇక తర్వాత రమ్యకృష్ణ కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిన్నటి రోజున ఈ పాత్రకు కూడా డబ్బింగ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక నానా పటేల్ నటించిన మరాఠీ సినిమా నట్ సామ్రాట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై కూడా కృష్ణవంశీ భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఏ స్థాయిలో ఈ సినిమా విజయం అందుకుంటుందో తెలియాల్సి ఉంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి