అల్లు శిరీష్ గతంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవారు. మెగా హీరోలను టార్గెట్ చేసే పోస్టులకు సైతం స్పందించడానికి వెనుకాడే వారు కాదు.ఈ సమయంలో ఒక వర్గం నేటిజెన్ల నుంచి అతను చాలా నెగిటివ్ ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు అల్లు శిరీష్ లో యాక్టివిటీలో పూర్తి చేంజ్ వచ్చిందని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఏదైనా అవసరం ఉంటే తప్ప తరచుగా ఉపయోగించడం లేదు అల్లు శిరీష్. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యువ హీరో అని పేర్కొన్నాడు.
దీంతో ట్రోలింగ్ను కూడా పట్టించుకోవడం మానేశానని ప్రశాంతంగా ఉండడానికి అలవాటు చేసుకుంటున్నానని తెలియజేశారు అల్లు శిరీష్. ఇటీవల ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రమోషన్లలో భాగంగా కాలేజీలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ ఉపయోగిస్తూ శిరీష్ పై అతని కుటుంబ సభ్యులపై అసహనమైన కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే హీరోల పైన ట్రోలింగ్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. కుటుంబాన్ని కూడా అందులోకి లాగడం అనేది చాలా అసహ్యకరమని చెప్పవచ్చు. కేవలం కొంతమంది హీరోల ఫ్యాన్స్ దిగజారి ఇలా కుటుంబాలపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ప్రేక్షకులు భావిస్తూ ఉన్నారు. ఈ సినిమాతో నైనా అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ కెరియర్ మారుతుందేమో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి