టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని అఖిల్ ఆఖరుగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా , పూజా హెగ్డేమూవీ లో అఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది. అఖిల్మూవీ తో కెరియర్ లో మొట్ట మొదటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తర్కెక్కుతున్న ఏజెంట్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో సాక్షా వైద్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  మమ్ముట్టి ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మూవీ కి హిప్ హప్ తమిజా సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు తో పాటు హిందీ ,  తమిళ్ ,  కన్నడ , మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఏజెంట్ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ లో అఖిల్ అద్భుతమైన స్టైలిష్ లుక్ లో ఉండడంతో ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఏజెంట్ మూవీ ని కొంత కాలం క్రితం ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.  
ఆ తరువాత ఏజెంట్ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఏజెంట్ మూవీ ని సంక్రాంతికి కూడా విడుదల చేయడం కష్టమే అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఏజెంట్ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: