
ఇదిలా వుండగా సీనియర్ హీరోలు ఇటీవల ఒక్క బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడానికి ముప్పు తిప్పలు పడుతుంటే .. బాలకృష్ణ మాత్రం సింగిల్ హ్యాండ్ తో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో విదేశాలలో సైతం కలెక్షన్లు సునామీ సృష్టించిన బాలయ్య.. ఇప్పుడు క్రాక్ మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాను చేస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరొకసారి మాస్ ప్రభంజనం సృష్టించనున్నారు బాలయ్య.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో అప్డేట్స్ ప్రేక్షకులలో మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. మరి ఈ సినిమా నుంచి పాటలు ఎప్పుడు విడుదలవుతాయని అందరూ ఎదురు చూస్తూ ఉండగా.. బాలయ్య అభిమానులకు ఒక మంచి గుడ్ న్యూస్ అందించింది చిత్ర బృందం. ఈ వారంతంలోగా ఈ సినిమా నుంచి మొదటి పాట విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈ పాట ప్రేక్షకులను ఏ విధంగా అలరిస్తుందో చూడాలి. మొత్తానికి అయితే వీరసింహారెడ్డి సినిమాతో బాలయ్య తన ఖాతాలో మరో విజయాన్ని పొందబోతున్నట్లు తెలుస్తోంది . ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక యాక్షన్ మూవీని చేయబోతున్నారు బాలయ్య.