తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న కాంబినేషన్ లో బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది వరకు మూడు సినిమాలు తెరకెక్కి మూడు కూడా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మొదట గా సింహా మూవీ తెరకెక్కింది. అంతకు ముందు వరస అపజయాలతో డీల పడిపోయిన బాలకృష్ణ "సింహ" మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో లెజెండ్ మూవీ తెరకెక్కింది.

మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. వీరిద్దరి కాంబినేషన్ లో పోయిన సంవత్సరం అఖండ మూవీ తెరకెక్కింది. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన అఖండ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటికే ఈ వీరిద్దరి కాంబినేషన్ లో మూడు మూవీ లు తెరకెక్కి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలు సాధించాయి. ఇది ఇలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ ని సెట్ చేయడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న కొంత మంది నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ ని సెట్ చేయడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు , ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ వారు , 14 రీల్స్ ప్లేస్ బ్యానర్ వారు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇది వరకు బాలకృష్ణ , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన మూడు మూవీ లలో కూడా బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించి ప్రేక్షకులను అలరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: