హీరో నితిన్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన విడుదలై మొదటి షో తోనే నెగెటివ్ టాక్ను తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలకు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేసింది. ముఖ్యంగా పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందుచేతనే ఈ సినిమాకు మంచి హైప్ ఏర్పడింది. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా రాబట్టలేక అభిమానులను నిరాశపరిచింది.


ఇక దీంతో కలెక్షన్ల పరంగా కూడా పెద్దగా రాబట్టలేక పోయింది. ముఖ్యంగా ఈ చిత్రం విడుదల సమయంలో సీతారామం, బింబిసార, కార్తికేయ-2 వంటి తదితర చిత్రాలు విడుదలయ్యాయి. దీంతో ఈ చిత్రానికి పెద్ద నష్టం పడిందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాతగా కూడా వ్యవహరించారు. థియేటర్లో నిరాశపరిచిన ఈ చిత్రం నితిన్ అభిమానులు ఎప్పుడు ఓటీటి లో విడుదలవుతుందా అని చాలా ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ ఈ సినిమా ఓటిటి గడిచిన రెండు రోజుల క్రితం నుంచి వైరల్ గా మారుతోంది.మొదట ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావాల్సి ఉండగా కొన్ని ఆర్థిక లావాదేవుల విషయంలో చిన్న చిన్న గ్యాప్ రావడంతో నిర్మాతలు ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త సినిమాలు చాలావరకు ఓటీటి లో విడుదలకు సిద్ధంగా ఉండడంతో మాచర్ల నియోజకవర్గం మాత్రం వెంటనే రాలేకపోయింది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు అన్ని అడ్డంకులను తొలగించుకొని డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటి సంస్థ Zee -5 ఈ చిత్రాన్ని కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది ఈ చిత్రం డిసెంబర్ 9వ తేదీన జి ఫైవ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. బుల్లితెర పైన ఈ చిత్రం ఎలా లభిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: