మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , బుచ్చిబాబు సనా కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మూవీ తేరకెక్క బోతున్నట్లు అనేక వార్తలు బయటికి వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ తేరకేక్కబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వృద్ధి సినిమా సంస్థ ఈ మూవీ ని నిర్మించనుండగా ,  మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ వ్రైటింగ్ సంస్థలు ఈ మూవీని  సమర్పించ బోతున్నాయి.

మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా రూపొండబోతుంది. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్మూవీ లో హీరో గా నటించడం ,  ఉప్పెన మూవీ తో బ్లాక్ బాస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న బుచ్చిబాబు సన ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ మూవీ స్టార్ట్ కాకముందే ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంగీతం అందించబోయేది ఎవరు అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

కాకపోతే ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశం చాలా వరకు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో తేరకేక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ న్యూజిలాండ్ లో జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: