నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రతి ఒక్కరికి తెలుసు..ఆమె సినీ జీవితం గురించి అందరికి తెలిసిందే..ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నఈ భామ ఆ తర్వాత విజయ్‌తో గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి సినిమాలు చేసింది.నటనతో పాటు అందచందాలతో తెలుగు వారిని గత కొన్ని సంవత్సరాలుగా అలరిస్తూనే వస్తుంది. అయితే వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఈ శాండిల్ వుడ్ బ్యూటీ అందిపుచ్చుకుంటూ దూసుకెళుతుండగా..


తాజాగా రష్మిక మందన్నకి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రష్మిక మందన్న ప్రస్తుతం హీరోయిన్‌గా చేస్తూనే ఓ ఐటెం సాంగ్‌లో నటించడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB 28 చేస్లుండగా, ఈ సినిమాలో గ్లామర్ డోస్‌ను త్రివిక్రమ్ బాగానే పెంచాడు. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ అయిన పూజా హెగ్డే ,శ్రీలీల నటిస్తున్నారు. వీరిద్దరితో పాటు ఇప్పుడు రష్మిక మందన్న ఐటెమ్ సాంగ్ చేస్తుందనే వార్త బయటకు రావడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు.


ముగ్గురు భామలు ఒక సినిమాలో నటిస్తున్నారు అనే సరికి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. రష్మిక.. ఇంతకు ముందు మహేష్, అనీల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అయితే మహేష్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు నాలుగు కోట్ల వరకుఇటీవలె ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకోగా, రెండో షెడ్యూల్ ప్రారంభం అయ్యేలోపే మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, తండ్రి ఇందిరాదేవి కన్నుమూయడంతో షూటింగ్ వాయిదా పడింది.

డిసెంబర్ రెండో వారం నుంచి తదుపరి షెడ్యూల్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రష్మిక ఇటీవల తెలుగులో సీతారామం అనే సినిమాతో పలకరించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆమె నటించిన మరో సినిమా గుడ్ బై ఇటీవల విడుదలై ఓకే అనిపించుకోగా, ప్రస్తుతం హిందీలో మిషన్ మజ్ను అనే స్పై థ్రిల్లర్ లో నటిస్తుంది. ఇప్పుడు రష్మిక గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది..ఈమెను బ్యాన్ చెయ్యాలని కన్నడ ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: