ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని తెచ్చుకున్న అతి కొద్ది మంది హీరోలలో ఒకరు అడవి శేష్ గారు అని చెప్పొచ్చు..కెరీర్  మొదటి ప్రారంభం లోనే ఈయన క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మరియు నెగటివ్ రోల్స్ లో  బాగా ఎక్కువగా కనిపించేవాడు..పంజా లో ఈయన చేసిన శాడిస్టు పాత్ర ఇప్పటికి ఎవ్వరు మర్చిపోలేరు అని c మనం చెప్పొచ్చు,ఆ తర్వాత బాహుబలి సినిమా లో నెగటివ్ రోల్ ద్వారా పాన్ ఇండియా మార్కెట్ కి పరిచయం అయ్యాడు ఈ నటుడు

ఇక ఆ సినిమా తర్వాత నుండి క్యారక్టర్ ఆర్టిస్టు మరియు విలన్ రోల్స్ కి టాటా చెప్పేసి..తన సొంత స్క్రిప్ట్స్ తో తనని తానె హీరో గా పెట్టుకొని సినిమాలు తియ్యడం ప్రారంభించారు..అలా ఇప్పటి వరుకు ఆయన హీరో గా నటించిన క్షణం, గూఢచారి,ఎవరు , మేజర్ మరియు లేటెస్ట్ గా 'హిట్ 2 ' వంటి చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి సూపర్ హిట్స్ గా నిలుస్తూ అడవి శేష్ తన కెరీర్ ని ఎక్కడికో తీసుకెళ్లింది.

ఇప్పుడు అడవి శేష్ సినిమా అంటే మార్కెట్ లో ఒక బ్రాండ్..థ్రిల్లర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన హీరో మరీ..తనకంటూ మార్కెట్ లో ఒక మినిమం గ్యారంటీ హీరో అనే ముద్ర పడిపోవడం తో అడవి శేష్ తన రెమ్యూనరేషన్ ని కూడా బాగా పెంచేసాడట..ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకు 7 నుండి 10 కోట్ల రూపాయిల వరుకు డిమాండ్ చేస్తునట్టు మనకు సమాచారం..నిర్మాతలు కూడా ఆయన అడిగినంత అడ్వాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు..కానీ కొంతమంది నిర్మాతలు మాత్రం అడవి శేష్ అడిగినంత ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు అట మరీ.

ఎందుకంటే అడవి శేష్ కేవలం థ్రిల్లర్ సినిమాలకు మాత్రమే పరిమితం అయిపోయాడు..థ్రిల్లర్ సినిమాలకు కేవలం A సెంటర్స్ లో మంచి కలెక్షన్స్ వస్తాయి కానీ..మాస సెంటర్స్ లో ఆడడం కష్టం..అంతే కాకుండా ఎల్లప్పుడూ థ్రిల్లర్ జానర్ సినిమాలే తీస్తే ఆడియన్స్ కి కూడా విసుగు వస్తుంది..అడవి శేష్ జానర్ మారిస్తే ఆయన అడిగినంత ఇవ్వడానికి మాకు ఏ మాత్రం ప్రాబ్లెమ్ లేదని కొంతమంది నిర్మాతలు ఇలా అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: