కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న తలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . విజయ్ ఈ సంవత్సరం బీస్ట్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . ఈ మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని సాధించింది . ప్రస్తుతం విజయ్ , వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న వారిసు అనే తమిళ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు . రష్మిక  మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు . ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా జనవరి 12 తేదీన విడుదల చేయనున్నారు . ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని పోస్టర్ లను మరియు రెండు పాటలను విడుదల చేసింది . వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది .

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని జనవరి 12 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు . తెలుగు లో ఈ మూవీ ని వారసుడు అనే టైటిల్ తో విడుదల చేయబోతున్నారు . ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా కోసం భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యూనిట్ తమిళ్ లో భారీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యూనిట్ డిసెంబర్ 24 వ తేదీన నెవర్ బిఫోర్ రేంజ్ లో ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఫంక్షన్ నిర్వహించడానికి సన్నాహాలను మొదలు పెట్టినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: