చాలాకాలం తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ టాక్ షో లో పాల్గొన్నారు .ఎప్పుడూ మొహమాటంగా ఉండే ప్రభాస్ ఇలాంటి షోకు హాజరవడంతో ఈయన అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. సాధారణంగా ఆయన ఫ్యాన్స్ కి ప్రభాస్ దర్శనం చాలా అరుదుగా దొరుకుతుంది. ఇక ఈ క్రమంలోనే బాలయ్య హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్ స్టాప్ షో కి ప్రభాస్ గెస్ట్ గా రావడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు .ఇక ప్రభాస్ బాలయ్య ఎపిసోడ్ కి  సంబంధించిన ఫోటోలు ప్రోమోలో ఇటీవల బయటకు రావడంతో ప్రభాస్ ధరించిన షర్ట్  ఎంతో ఆకర్షిస్తుంది. అయితే సాధారణంగా  స్టార్స్ గురించి ప్రతి విషయం ఆసక్తి రేపుతుంది.  

ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ వేసుకున్న షర్ట్ ధర ఎంత ఏ బ్రాండ్ అని సమాచారం రాబట్టారు అభిమానులు .ఎల్లో బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న ఆ షర్ట్ ఫాలో గల్ఫ్ లరెన్ అనే బ్రాండ్ గా తెలుస్తోంది .ఇక ఆన్లైన్లో ఈ షర్టు ధర 115 పౌండ్స్ గా ఉంది. ఇక మన ఇండియన్ కరెన్సీలో 11,618 రూపాయలు అనమాట. ఇక ఒక్క సినిమాకు 100 కోట్లు తీసుకునే ప్రభాస్ కి 11,000 అంటే చాలా తక్కువ అని చెప్పాలి .అయితే ఒక మధ్యతరగతి వ్యక్తి ఏడాదికి సరిపడా బట్టలు షాపింగ్ చేయొచ్చు అన్నమాట. బోల్డ్ అండ్ కాంట్రవర్సీ ప్రశ్నలకు ఈ షో ఇప్పుడు కేరాఫ్ అడ్రస్ గాని నిలిచింది.

అయితే ఈ నేపథ్యంలో ప్రభాస్ ని బాలకృష్ణ చాలా ప్రశ్నలే అడిగాడు. 43 ఏళ్ల ప్రభాస్ వివాహం చేసుకోలేదు. ఇక ఈ విషయం కచ్చితంగా చర్చకు వస్తుంది అని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాలయ్య ఇంకా ప్రభాస్ ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగడం ఖాయం అంటూ నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు .దాంతోపాటు హీరోయిన్ అనుష్కతో ఎఫైర్ రొమాన్స్ గురించి అడిగే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రభాస్ తో పాటు ఈ షోలో మిత్రుడు గోపీచంద్ కూడా దర్శనం ఇవ్వనున్నాడు. అయితే ప్రభాస్ గోపీచంద్ లతో బాలయ్య ఎలా మాట్లాడుతాడు అన్నది లేచి చూడాలి. దీంతోపాటు మరోవైపు ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ లలో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: