ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన అనిల్ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 100కు పైగా బాలీవుడ్ సినిమాలలోనూ అలాగే కొన్ని అంతర్జాతీయ చిత్రాలలోనూ.. టీవీ సీరియల్స్ లో కూడా నటించిన ఈయన వంశవృక్షం అనే తెలుగు సినిమాతో కూడా హీరో పాత్ర వేసి తన కెరీర్ ను ప్రారంభించాడు. అంతర్జాతీయ చిత్రాలలో ఆయన ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన స్లమ్ డాగ్ మిలియనీర్ లో మొదటిసారిగా నటించాడు. రెండు జాతీయ పురస్కారాలు.. ఆరు ఫిలిం పేరు పురస్కారాలతో పాటు మరెన్నో పురస్కారాలు కూడా అందుకున్నారు.

1956 డిసెంబర్ 24వ తేదీన మహారాష్ట్ర ముంబై చెంబూరులో జన్మించిన అనిల్ కపూర్ నేడు పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఇకపోతే ఈయన తల్లి పేరు నిర్మల్.. తండ్రి పేరు సురేందర్ కపూర్.  ముంబైలోని పంజాబీ కుటుంబంలో జన్మించిన ఈయన..  తండ్రి సినీ నిర్మాత సురేందర్ కపూర్.. నలుగురు పిల్లలలో ఈయన రెండోవాడు ఇతని అన్న బోనీకపూర్ సినిమా నిర్మాత కాగా తమ్ముడు సంజయ్ కపూర్ నటుడు. బోనీ కపూర్ భార్య శ్రీదేవి స్వయాన అనిల్ కపూర్ కు వదిన అవుతుంది. శ్రీదేవి తో మంచి అనుబంధం పెంచుకున్న అనిల్ కపూర్ ఆమె మరణించినప్పుడు పూర్తిస్థాయిలో దిగ్బ్రాంతికి గురి అయ్యాడు.


ఇక ఆయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 1984లో సునీత కపూర్ ను వివాహం చేసుకున్నారు.  ఈయనకు ఇద్దరు కుమార్తెలు.. ఒక కుమారుడు కూడా ఉన్నారు. పెద్ద కుమార్తె సోనం కపూర్ హీరోయిన్ కాగా.. చిన్న కూతురు ప్రియా కపూర్ న్యూయార్క్ లో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని నిర్మాతగా మారింది. 1970లో తూ పాయల్ మే గీత్ అనే హిందీ సినిమాలో  చిన్నప్పటి శశికపూర్ లా నటించాడు.  అయితే ఈ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత 1980లో బాపూ దర్శకత్వంలో వచ్చిన వంశవృక్షం అనే  తెలుగు సినిమా ద్వారా కథానాయకుడిగా మారాడు . ఒకరకంగా చెప్పాలి అంటే తెలుగు సినీ పరిశ్రమ ఈయనను హీరోగా నిలబెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: