తెలుగు ఓటిటి ప్లాట్ఫామ్ ఆహా తక్కువ సమయంలోనే ఎంత క్రేజ్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్ ఓటిటి ప్లాట్ ఫామ్స్ కి గట్టి పోటీ ఇచ్చే విధంగా ఆహా మారిపోయింది అని చెప్పాలి. ముఖ్యంగా ఆహా కి ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోవడానికి కారణం అటు బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో అని చెప్పాలి. బాలయ్యతో అన్ స్టాపబుల్ మొదటి సీజన్ చేయగా అది సూపర్ సక్సెస్ అయింది. ఇక ఆహా కి ఒక్కసారిగా సబ్స్క్రైబర్లు కూడా పెరిగిపోయారు.


 ఇక ఆ తర్వాత బాలయ్యతో అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ప్రారంభించారు అని చెప్పాలి. అయితే ఇక ఈ సీజన్లో అటు ఇక తమ క్రేజ్ ని మరింత పెంచుకునేందుకు ఎపిసోడ్స్ ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేశారు ఆహా నిర్వాహకులు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది స్టార్లను ఈ షోకి పిలిపించడం చేస్తున్నారు. అయితే ఇటీవలే బాహుబలి ఎపిసోడ్ పేరుతో ఏకంగా ప్రభాస్ ని  గెస్ట్ గా పిలిపించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ ఎపిసోడ్ విడుదల అయిందో లేదో ఆహా సబ్ స్క్రిప్షన్  కోసం ఎంతోమంది పోటీ పడ్డారు. ఇక అందరూ ఒకేసారి ఆహా ఓపెన్ చేయడంతో సర్వర్స్ ఒక్క సరిగా డౌన్ అయిపోయాయి.


 కొన్ని గంటలకి ఆహా ఓటిటి ప్లాట్ఫామ్ పని చేయని విధంగా క్రాష్ అయిపోయింది అన్న విషయం తెలిసిందే . లిమిట్ కంటే ఎక్కువ స్థానంలో సబ్ స్క్రైబర్లు  రావడంతో ఇక ఆహా బ్యాలెన్స్ చేయలేకపోయింది అని చెప్పాలి. అయితే ఇక ప్రభాస్ ఎపిసోడ్ ని చూడాలనుకున్న ఎంతోమంది అంతలోనే పైరసి అందుబాటులోకి రావడంతో ఆహా కి జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. 12 గంటలైనా ఆహాలో ఎపిసోడ్ కనిపించలేదు. కానీ 10 గంటల్లోనే  ఉచితంగా ఇతర యాప్లలో డౌన్లోడ్ చేసుకోవడం మొదలుపెట్టారు అందరు. దీంతో ఇక ప్రభాస్ ఎపిసోడ్ కారణంగా ఆహా వారికి భారీగా నష్టం వాటిల్లిందని మాత్రం అర్థమవుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తర్వాత రాబోయే పవన్ ఎపిసోడ్ పై జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: