టాలీవుడ్ స్టార్ హీరో మరియు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే పవన్ కళ్యాణ్ ని తరచూ ప్రత్యర్ధులు ఎక్కువగా ఆయన పెళ్లిళ్ల గురించి విమర్శలు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఆయన జీవితంలో ఆయన చేసుకున్న పెళ్లిళ్లు ఎప్పటికి చెరగని మచ్చ లాగా మిగిలిపోయాయి. పెళ్లికి సంబంధించి ఆరోపణలు వచ్చినప్పటికీ అవినీతికి సంబంధించి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పై ఎటువంటి ఆరోపణలు రాలేదు. రాజకీయాలలో సాధారణంగా పవన్ ని విమర్శించాలి అంటే ఆయన పెళ్లి గురించే మొదటగా ప్రస్తావిస్తారు. 

ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ని వైసిపి వాళ్ళు తిట్టాలి అంటే పెళ్లి పేరు ఎత్తే విమర్శిస్తారు.అంతే తప్ప పవన్ ని విమర్శించడానికి మరే కారణాలు దొరకవు. అయితే ఇటీవల తన పెళ్లి గురించి ఆరోపణలు రావడంతో... నేను పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల మీకేం నష్టం వచ్చింది. కావాలంటే వాళ్ళను కూడా పెళ్లిళ్లు చేసుకోమని చెప్పండి అంటూ వైసీపీ వాళ్లపై పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై స్పందించాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ప్రస్తుతం  వాల్తేరు వీరయ్య ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

రాజకీయ నేతలు పవన్ మీద చేసే విమర్శలపై మీ స్పందన ఏంటి అని యాంకర్ ప్రశ్నించింది.. ఇందుకుగాను  చిరంజీవి మాట్లాడుతూ.. రాజకీయంలో విమర్శల గురించి నేను మాట్లాడాలి అనుకోవడం లేదు.. ఇక పవన్ నాకు బిడ్డలాంటోడు.. పొలిటికల్ గా ఈ విషయం తన వ్యక్తిగతమని.. సాధారణంగా రాజకీయాల్లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు అని ..పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయం పూర్తిగా ఆయన వ్యక్తిగతం అని తెలియజేశారు చిరంజీవి... దీంతో మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: