రవితేజ తాజాగా హీరోగా వస్తున్న చిత్రం రావణాసుర. ఇటీవలే ధమాకా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా అతిథి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. చివరిగా ఈ సినిమాలో ఆయన చనిపోయే పాత్ర అయినా కూడా సినిమా మొత్తాన్ని మలుపు తిప్పిన పాత్రగా మంచి పేరు తెచ్చుకున్నారు. చివరిగా ఎమోషనల్ తో మరొక టర్న్ తీసుకొచ్చారని చెప్పవచ్చు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడమే కాదు ఇద్దరు ఎనర్జీ హీరోలను చూసి ప్రేక్షకులకు కూడా పూనకాలు వచ్చేసాయి.

ప్రస్తుతం రవితేజ రావణాసుర సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. హైదరాబాదులోని పోలీస్ అకాడమీ లో ఈ సినిమాకు సంబంధించిన ఒక పాట కూడా షూటింగ్ జరుగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి ప్రచారం అందుతుంది.. మిగిలిన రెండు పాటల షూటింగ్ పూర్తి చేస్తే సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి అత్తాపూర్ మాల్ లో కూడా ఒక పాట షూట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వంలో  వస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన అను ఇమ్మానుయేల్,  మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష, పూజిత పొన్నాడ వంటి ఐదు మంది హీరోయిన్లు నటిస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సాంగ్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పని మొదలుపెట్టి వీలైనంత త్వరగా ఫైనల్ గా సిద్ధం చేయాలని నిర్మాతలు కూడా కోరినట్లు సమాచారం. ఈ సినిమాకు నిర్మాతలుగా అభిషేక నామాలతో పాటు రవితేజ కూడా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా రూ.300 కోట్లతో తెరకెక్కుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వైరల్ గా మారుతుంది. మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: