బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా కొనసాగుతుంది యాంకర్ సుమ. దాదాపు దశాబ్ద కాలం నుంచి కూడా తిరుగులేని విధంగా నెంబర్ వన్ యాంకర్ గానే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక సుమ ఏదైనా షోకి యాంకరింగ్ చేస్తుందంటే చాలు ఆ షో సూపర్ హిట్ కావడం ఖాయం అని ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు కూడా భావిస్తూ ఉంటారు. అయితే కేవలం బుల్లితెరపై షోలు మాత్రమే కాదు ఇక సినిమా ఈవెంట్లు కూడా చేస్తూ బిజీ బిజీగా గడుపుతూ ఉంది. ప్రస్తుతం ఏ స్టార్ హీరో సినిమాకు సంబంధించిన ఫంక్షన్ అయినా కూడా ఇక ఆ సినిమాకు సుమని హోస్టింగ్ చేస్తూ ఉంది అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవలే క్యాష్ అనే కార్యక్రమాన్ని ఆపేసి సుమ అడ్డా అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇక ఎప్పటిలాగానే తనదైన రీతిలో యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతుంది. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది సినీ నటులు ఇక తమ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు సుమ అడ్డా అనే కార్యక్రమానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే సుధీర్ బాబు హీరోగా నటించిన హంట్ చిత్ర బృందం కూడా ఇటీవల సుమ అడ్డా అనే కార్యక్రమానికి వచ్చారు. అయితే తన షో కి వచ్చిన గెస్ట్ లతో ఫన్నీ టాస్కులు ఆడించడం సుమ ఎప్పటినుంచో చేస్తూ వస్తుంది.


 ఈ క్రమంలోనే ప్రేమిస్తే భరత్ తో ఒక ఫన్నీ టాస్క్ చేయించింది సుమ. ఈ క్రమంలోనే ఈ ఫన్నీ టాస్క్ లో భాగంగా ఏకంగా భరత్ సుమాకి నాకు పెళ్లయి ఒక్కరోజే అయిందని ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అంటూ ఒక డైలాగ్ చెప్పడంతో.. సుమ సైతం షాక్ అవుతుంది అని చెప్పాలి. అంతేకాదు ఇక భరత్ సుమాకి లైన్ వేస్తున్నట్లుగా నటిస్తూ ఇక లీనమైపోయాడు అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే రేటింగ్స్ కోసం ఇలాంటి పంచ్ డైలాగులు అవసరమా సుమా అంటూ కొంతమంది నేటిజన్స్ తిట్టిపోస్తూ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: