
దీంతో అభిమానుల సైతం కాస్త అయోమయంలో పడ్డారు. ఈ వివాహ జంట పెళ్లికి సిద్ధమవుతోంది అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. అయితే ఈ జంట ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడ కనిపించలేదు. అందుచేతనే సినీ ప్రేక్షకుల సైతం వీరి యొక్క ఉనికి గురించి పెద్దగా కథనాలు వినిపించలేదు. అయితే ఇప్పటికి అధికారికంగా ఒక హింట్ అయితే అందింది హైదరాబాదులో హీరో హీరో శర్వానంద్ నిశ్చితార్థ వేడుకలలో ..సిద్దార్థ్ -అదితి రావు హైదరితో కలిసి కనిపించారు వీరిద్దరూ జంటగా ఈ వేడుకకు హాజరైనట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ వేడుక లో సర్వ రక్షిత రెడ్డి జంట కంటి ఈ జంట పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు అక్కడ ఉన్న ప్రేక్షకులు.సిద్దార్థ్-అతిధి మహాసముద్రం సినిమాలో కలిసి నటించారు. ఇందులో శర్వాతో కలిసి కూడా నటించడం జరిగింది. అప్పటినుంచి వీరందరి మధ్య మంచి అనుబంధంగా ఉందని చెప్పవచ్చు. గతంలో సిద్దార్థ్ , అతిథితో కలిసి దిగిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది. ఇక కొన్నిసార్లు సిద్దార్థ్ అతిథిపై పలు రకాలుగా క్యాప్షన్లు పెట్టి ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇక శర్వానంద్ భార్య విషయానికి వస్తే ఈమె రాజకీయ బ్యాక్ గ్రౌండ్ అలాగే హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కుమార్తె అన్నట్లుగా తెలుస్తోంది.