సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి చేసింది తక్కువ సినిమాలే అయినా తమ అందం అభినయంతో తమ నటనతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న నటీమణులు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. అయితే తర్వాత కాలంలో సరైన అవకాశాలు రాక ఆ హీరోయిన్లు ఇండస్ట్రీలో కనుమరుగు  అయినప్పటికీ అభిమానులు మాత్రం ఆ హీరోయిన్లను ఎప్పటికీ మరిచిపోరు అని చెప్పాలి. ఇలా తన అందం అభినయంతో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ గౌరీ పండిట్.


 యాక్షన్ హీరోగా పేరు సంపాదించుకున్న గోపీచంద్ హీరోగా నటించిన ఆంధ్రుడు సినిమాలో గోపీచంద్  సరసన నటించింది గౌరీ పండిట్. ఇక ఈ సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది అని చెప్పాలి. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమాలో గౌరీ పండిట్ తన అందం అభినయంతో ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. మొదటి సినిమా తోనే ప్రేక్షకుల మధిలో చోటు సంపాదించుకుంది.


 ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఎన్నో రకాల హావభావాలు పండించాల్సి ఉంటుంది. ఇక ఈ పాత్రలో గౌరీ పండిట్ తన నటనతో కూడా మెప్పించింది. ఇక ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు ఈ అమ్మడికి తగినంత గుర్తింపు తీసుకురాలేదు. ఇక నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమైంది. 2011లో బాలీవుడ్ నటుడు నిఖిల్ ద్వివేదిని పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు అని చెప్పాలి. చివరిగా బాలీవుడ్ మూవీ హౌస్ ఫుల్ లో నటించింది. ఇకపోతే ఇటీవలే తన ఫ్యామిలీతో సరదాగా గడిపిన ఒక ఫోటోని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. దీంతో  తమ అభిమాన హీరోయిన్ ను చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: