
చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ను తెచ్చుకుంది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తం గా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లును చేసింది.
విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఆస్కార్‌కు నామినేషన్స్ ఎంట్రీలోనూ చోటు సంపాదించుకోవడం గమనార్హం.. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు పార్ట్ 2 తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కానీ ఇది కాంతారకు సీక్వెల్ కాదని ఇప్పటికే చిత్ర బృందం కూడా స్పష్టం చేసింది. అయితే కాంతార 2 ప్రకటించిన నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. తాజాగా దీనిపై హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి కీలక అప్డేట్ ను ఇచ్చారు.
తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన ఆయన కాంతార 2పై స్పందించారని తెలుస్తుంది.. 'వచ్చే ఏడాది కాంతార 2ను విడుదల చేయబోతున్నాం.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రి ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశాం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను మేము ప్రారంభిస్తాం. ఇది కాంతారకు సీక్వెల్ కాదు.ప్రీక్వెల్. తొలి భాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను అన్నీ ఇందులో చూపించబోతున్నాం. అలాగే పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు పార్ట్ 2లో ఎక్కువగా ఉంటాయి' అంటూ కూడా రిషబ్ చెప్పుకొచ్చారు.కాంతారా పార్ట్ 2 అందరిని కూడా బాగా మెప్పిస్తుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకేక్కిస్తున్నాం. ఈ సారి ఆస్కార్ లక్ష్యంగా ఈ సినిమాను నిలుపుతాం అని చెప్పడం జరిగింది.