టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప మూవీతో ఒక్కసారిగా అల్లు అర్జున్ క్రేజ్ మారిపోయింది.దేశావ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న బన్నీ పుష్ప సినిమాతో ఒక రేంజిలో పాపులర్ అయ్యాడు. ఆ సినిమాకి వసూళ్లు తక్కువ వచ్చిన సోషల్ మీడియాలో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక బన్నీకి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవడానికి ఆయన అభిమానులు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. కేవలం బన్నీకే కాదు.. ఆయన కూతురు అల్లు అర్హకు కూడా ఇప్పుడు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ కొద్ది రోజులుగా విశాఖపట్నంలో జరుగుతుంది.


ఇక ఈ షూటింగ్ గ్యాప్ లో బన్నీ అభిమానులతో కలిసి ఫోటో షూట్ ని ఏర్పాటు చేశారు. దీంతో ఆయనను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అందరికీ ఫోటో సెల్ఫీస్ ఇస్తూ.. సరదాగా గడిపారు అల్లు అర్జున్. కానీ కొంతమంది అభిమానుల ఆత్యుత్సాహం వల్ల ఆ కార్యక్రమంలో పెద్ద గందరగోళం అనేది నెలకొంది. దీంతో అక్కడ ఫోటోషూట్ ని మధ్యలోనే రద్దు చేశారు.అయితే బన్నీతో ఫోటో దిగేందుకు వచ్చిన ఆయన అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. కొందరు అబ్బాయిలు మాత్రం ఏకంగా స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. బన్నీతో ఫోటో దిగే అవకాశం చేజారిపోయిందనే బాధతో స్టేజ్ పైనే వెక్కి వెక్కి ఏడ్చారు బన్నీ అభిమానులు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ బాగా చక్కర్లు కొడుతూ హల్ చల్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: