సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సూర్య దేవర నాగ వంశీ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... పూజా హెగ్డే ... శ్రీ లీల మూవీ లో మహేష్ సరసన హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే యాక్షన్ ఎపిసోడ్ తో ప్రారంభమైంది. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ కి ఇప్పటి వరకు ఈ చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. మరి.కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను ఈ చిత్ర బృందం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ ను "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఫుల్ స్పీడ్ లో ఈ మూవీ యూనిట్ జరుపుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. 

ఎస్ ఎస్ ఎం బి 28 షూటింగ్ సెట్స్ నుంచి బయటికి వచ్చిన ఫోటోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ... దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ... నటుడు జయరామ్ లు ఉన్నారు. ఈ ముగ్గురికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: