గత కొంత కాలంగా సీనియర్ నరేష్ పవిత్ర ల సహజీవనం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను స్వయంగా నరేష్ ఒప్పుకోవడంతో వీరిద్దరి మధ్య సహజీవనం అధికారికంగా అందరికీ తెలిసింది. ఆమధ్య వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేసినప్పుడు అది నిజమైన పెళ్ళి అనుకున్నారు అంత. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘మళ్ళీ పెళ్ళి’ మూవీకి సంబంధించిన ఒక టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.


నరేష్ బాలనటుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆతరువాత హీరోగా మారి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ మూవీని స్వయంగా నరేష్ నిర్మించాడు. ఎమ్ ఎస్ రాజ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో తెలుగుతో పాటు కన్నడంలో కూడ విడుదల చేయబోతున్నారు. ఈమూవీలో శరత్ బాబు జయసుధ వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ళ మొదలైన వారు ఈమూవీలో నటిస్తున్నారు. వయసు మళ్ళాక రెండో వివాహం అవసరం గురించి ఈమూవీ కథలో వివరిస్తారని తెలుస్తోంది.
ఈమూవీలో నరేష్లవ్ కెమిస్ట్రీని చాల ఘాడంగా చూపించారని తెలుస్తోంది. ఈమూవీ కూడా సమ్మర్ రేసులో విడుదల కాబోతోంది అన్నసంకేతాలు వస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీలో హీరో హీరోయిన్స్ ఎవరు ఉండరు. కథ అంతా నరేష్ పవిత్రల చుట్టూనే తిరుగుతుంది. వీరి జంటకు ఏర్పడిన క్రేజ్ రీత్యా ఈమూవీకి కలక్షన్స్ వస్తాయని నరేష్ ఆశిస్తున్నాడు. వీరి పెళ్ళి వార్తల గురించి ఎంతో ఆశక్తికనపరిచిన తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు నరేష్ అంచనాలను అందుకుంటారో చూడాలి. ఈ మూవీకి మొదట్లో సెకండ్ ఇన్నింగ్స్ అన్న టైటిల్ పెడదాము అంకున్నారట. అయితే మళ్ళీ పెళ్ళి అన్న టైటిల్ అన్ని విదాల బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో ఈ టైటిల్ పెట్టినట్లు తెలిస్తోంది. ఈసినిమా విజయవంతం అయితే తెలుగు ప్రేక్షకులు నరేష్ పవిత్రల బంధానికి ఆమోద ముద్ర వేసినట్లు అనుకోవాలి..మరింత సమాచారం తెలుసుకోండి: