ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్న సినిమాలలో ఆది పురుష్ ఒకటి. ఈ మూవీ లో ప్రభాస్ హీరో గా నటించగా ఓం రౌత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తి అయింది. ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఫుల్ వేగ వంతంగా నిర్వహిస్తుంది.

ఇది ఇలా ఉంటే ప్రభాస్మూవీ లో రాముడి పాత్రలో కనిపించనుండగా ... కృతి సనన్ ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించబోతుంది. ఇది ఇలా ఉంటే సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు. కొంత కాలం క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. కానీ ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకులు అనుకున్నంత రేంజ్ లో రెస్పాన్స్ లేకపోవడంతో ఈ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా వి ఎఫ్ ఏక్స్ పై తీవ్ర కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ఇంకా ఎక్కువ సమయం లేదు. అయినప్పటికీ ఈ మూవీ యూనిట్ మాత్రం ఇప్పటికి కూడా ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టలేదు. కాకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం శ్రీరామ నవమి నుండి ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.  శ్రీరామ నవని నుండి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ లను వరుసగా విడుదల చేయడానికి కూడా.చిత్ర బృందం ప్రస్తుతం సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: