తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని మంచి గుర్తింపును సంపాదించుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటువంటి పొడుగు కాళ్ళ సుందరి ఫరియ అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ జాతి రత్నాలు మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును దక్కించుకుంది. 

ఆ తర్వాత అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన బంగార్రాజు మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించి తన అంద చందాలతో ... డ్యాన్స్ తో కూడా ప్రేక్షకులను మైమరిపించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ రావణాసుర అనే మూవీ లో ముఖ్య పాత్రలో నటించింది. రవితేజ హీరోగా రూపొందిన ఈ మూవీ కి సుదీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఫరియ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఫరియ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఫరియ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీని కట్టుకొని ... పింక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఫరియ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: