ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప ది రైస్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ... నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ ని మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా ... రావు రమేష్ , సునీల్ , అనసూయమూవీ లో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

ఫాహధ్ ఫజిల్మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... సమంత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ లోని అల్లు అర్జున్ నటనకు గాను ప్రేక్షకుల నుండి .. విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి భాగం సూపర్ సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం ఈ మూవీ రెండవ భాగం పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ రెండవ భాగం షూటింగ్ ప్రారంభం అయింది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ సంవత్సరం అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుండి ఒక వీడియోను విడుదల చేసే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ కి ఉన్న క్రేజ్ దృశ్య ఈ చిత్ర బృందం ఈ మూవీ యొక్క డిజిటల్ రైట్స్ కు ఏకంగా 200 కోట్లకు కోడ్ చేస్తున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ నెట్ ఫ్లి డిజిటల్ సంస్థ తో బెర సారాలు ఆడుతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: