తమిళ హీరో సూర్య డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ తెలుగు రాష్ట్రాలలో కూడ తన మార్కెట్ ను ఇమేజ్ ని పెంచుకోవడానికి అన్ని వ్యూహాలు అనుసరిస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ మీడియా ఆకాశానికి ఎత్తేస్తూ సూర్య కెరియర్ లోనే అత్యంత భారీ సినిమాగా ఏకంగా ఒకేసారి 10 భాషలలో విడుదల చేస్తున్న అతడి మూవీకి ‘కంగువ’ అన్న టైటిల్ పెట్టారు.

 

 

వచ్చేఏడాది సంక్రాంతికి ఈసినిమాను విడుదల చేస్తున్నట్లు ఈమూవీ నిర్మాతలు ప్రకటిస్తూ విడుదల చేసిన ఈమూవీ టైటిల్ లుక్ పోష్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఎవరు ఊహించని విధంగా ఈమూవీకి అన్నిభాషలలోను ‘కంగువ’ పేరుతోనే ప్రమోట్ చేస్తున్నారు. ఈపదానికి అర్థం ‘అగ్ని లక్షణాలు’ ఉన్నవాడు అని తెలుస్తోంది.

 
అనుకున్న లక్ష్యం కోసం ఎంతటి సాహసానికైనా ఈమూవీలోని హీరో ముందుకు దూకుతాడట. ఈమూవీ పోస్టర్ లో గుడ్లగూబ గద్ద పోలికలతో ఉన్న భారీ పక్షి ఆకారాన్ని చూపెడుతున్నారు కానీ ఎక్కడా సూర్య లుక్ ను బయటపెట్టలేదు. పీరియాడిక్ డ్రామాగా తీయబడుతున్న ఈమూవీలో వివిధ కాలాలకు సంబంధించిన వెరైటీ గెటప్స్ లో సూర్య కనిపిస్తాడట. సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ ఒక డిఫరెంట్ ప్రయోగం అని అంటున్నారు. తమిళ టైటిల్స్ తెలుగులోనూ యథావిధిగా పెట్టడం ఈమధ్యన ట్రెండ్ గా మారిపోయింది.

 

 ఈ కల్చర్ కు తెలుగు ప్రేక్షకులు కూడ అలవాటు పడుతున్నారు. ‘తలైవి’ ‘వలిమై’ టైటిల్స్ తో తెలుగులో తమిళ డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈసినిమా వచ్చేఏడాది సంక్రాంతికి విడుదల అవుతోంది అని ప్రకటించడంతో ఇదే సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ మహేష్ త్రివిక్రమ్ ల మూవీకి తమిళ హీరో సూర్య గట్టి పోటీ ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా తమిళ హీరోలు అంతా తెలుగు మార్కెట్ పై కన్నేసి దూసుకు పోతుంటే ఇంకా మన తెలుగు హీరోలు మాత్రం తమిళ మార్కెట్ లో తమ క్రేజ్ ను పెంచుకోలేకపోతున్నారు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి..    

 


మరింత సమాచారం తెలుసుకోండి: