
యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన 2018 చిత్రాన్ని తెలుగులో గీత ఆర్ట్ సంస్థ విడుదల చేయడం జరిగింది. ఈనెల 26న విడుదల చేసిన ఈ సినిమా తెలుగులో మంచి టాక్ తో దూసుకుపోతోంది.మొదటి రోజు రూ.1.2 కోట్ల రూపాయలు రాబట్టగా రెండవ రోజు కూడా ఈ సినిమా ఏకంగా రూ.1.71 కోట్ల రూపాయల గ్రాసును రాబట్టింది 2018 తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఏరియాలలో అదిరిపోయే స్పందన లభించింది. ఫలితంగా రెండు మూడు రోజులలోనే అన్ని ప్రాంతాలు కలుపుకొని రూ.2.73 కోట్ల రూపాయల గ్రాస్ తో పాటు.. రూ.1.28 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది.
2018 సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లు బిజినెస్ విషయానికి వస్తే రూ.1.80 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది.. ఇక మొదటివారం ఈ సినిమా పూర్తి అయ్యేలోపు రూ .5 కోట్లకు పైగా గ్రాస్ వస్తువులు చేసి మొదటి వారం పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో కూడా అల్లు అరవింద్ మంచి లాభాలను పొందాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై అధికారికంగా చిత్ర బృందం గానీ అల్లు అరవింద్ ఎంతటి లాభం వచ్చిందో ప్రకటిస్తారేమో చూడాలి మరి