టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన అనుష్క సినీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ మరియు రానా కాంబినేషన్లో వచ్చిన ఈ మల్టీ స్టార్ సినిమా తెలుగు సినిమా వ్యాపించేలా చేసింది .ఈ సినిమా కారణంగా ఇప్పుడు వస్తున్న అన్ని సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల చేస్తున్నారు. సంచలనాలను సృష్టించి రికార్డులను తిరగరాసిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమాలో మొదటి భాగంలో అనుష్క బానిసగా రెండవ భాగంలో యువరాణిగా తన నటనతో అందరిని మెప్పించింది అనుష్క. 

అయితే ఇలాంటి ఒక సినిమాలో అనుష్క పాత్రకు కొన్ని సన్నివేశాలు డూప్ ని పెట్టి నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆమె అంతలా అనుష్క క్యారెక్టర్ లో మునిగిపోయి నటించింది కాబట్టి .ఆమె కూడా చూడడానికి అచ్చం అనుష్కలాగే ఉంటుంది. కాబట్టి ఆమెను డూప్ అని అస్సలు అనుకోరు. చూసిన వెంటనే ఆమె అనుష్క కాదని గుర్తుపట్టలేరు. అంతలా తన నటనతో తన పోలికలతో అదరగొట్టేసింది ఆమె. అయితే ఈ క్రమంలోనే అనుష్క ఎవరు అని ఆరాతీస్తున్నారు చాలామంది. ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆమె కూడా ఒక హీరోయిన్ అని ఆమె పేరు రుషిక రాజ్ అని అంటున్నారు.

దూరం నుంచి చూస్తే అనుష్క రుషిక ఇద్దరు ఒకేలాగా ఉంటారని అంటున్నారు. అంతేకాదు ఈమె డూప్ గానే కాకుండా బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా నటించిందట. తాజాగా ఇప్పుడు వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అనుష్క సినిమాల విషయానికి వస్తే బాహుబలి సినిమా తర్వాత అనుష్కకి వరుస సినిమాల్లో నటించే అవకాశం వస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఆమె మాత్రం ఒకటి రెండు సినిమాల్లోనే మెరిసింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: