జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న అనసూయ. ఆ తర్వాత హీరోయిన్ స్థాయి స్టార్ డమ్ ను కూడా దక్కించుకుంది.

సోషల్ మీడియా లో హీరోయిన్స్ కి ఉన్నంత రేంజ్ ఫాలోయింగ్ ఈమె కి ఉంది అనడంలో సందేహం అయితే లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియా లో చేసే ప్రతి పోస్ట్ కి కూడా సూపర్ రెస్పాన్స్ అయితే దక్కుతుంది. తాజాగా ఈమె సోషల్ మీడియా లో షేర్ చేసిన ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. భర్త తో కలిసి ఉన్న ఫోటోలను మరియు వీడియో లను బికినీ తో షేర్ చేయడం వల్ల ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఇప్పుడు బికినీ తో మరోసారి అందరిని సర్ ప్రైజ్ చేసింది. ఆ ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇక తాజాగా అనసూయ విమానం అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చింది. గతంలో రంగస్థలం సినిమా లో రంగమ్మత్త పాత్ర ఎలా అయితే ఉందో ఇప్పుడు విమానం సినిమా లో కూడా కాస్త అటు ఇటుగా అలాంటి పాత్రను... అలాంటి లుక్ లో చేయడం అయితే జరిగింది. వ్యభిచార వృత్తి లో ఉండే మహిళ పాత్ర ను అనసూయ పోషించినట్లు తెలుస్తుంది.ఈ మధ్య కాలంలో అనసూయ సినిమా లతో ఆశించిన స్థాయిలో అయితే మెప్పించలేక పోయింది. కానీ ఈ సినిమా తో బాగా ఆకట్టుకుంది. అయితే సినిమా లో ఆమె పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత అయితే లేదు. కాస్త ఎక్కువ స్కోప్ ఉంటే బాగుండేది అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారటా.. సినిమా ల్లో కీలక పాత్ర ల్లో నటించే అవకాశాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ఎక్కువ శాతం సినిమా లో స్క్రీన్ టైమ్ చాలా తక్కువ ఉన్న పాత్రలు మాత్రమే ఆమెకు వస్తున్నాయి. అది కాకుండా అనసూయ యొక్క పరిధి చాలా తక్కువ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కనుక ఇక ముందు అనసూయ కు ప్రాముఖ్యత లేని పాత్రలే వస్తాయా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.. జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలేసినందుకే అనసూయ కెరీర్ లో కష్టాలు వచ్చినట్లు కొందరు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: