ప్రతి మూడు నెలలకు ఒకసారి విష్ణు మా సభ్యులకు మెడికల్ చెకప్ చేయిస్తున్నారని ఆమె తెలిపారు. మెడికల్ పాలసీకి రూపాయి కూడా తీసుకోకుండా విష్ణు ఇన్సూరెన్స్ వచ్చేలా ఏర్పాట్లు చేశారని మలక్ పేట శైలజ అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ కు మై హోమ్ పక్కన విల్లా ఉందని ఆ విల్లా కొనిస్తానని విష్ణు అన్నారని ఆమె చెప్పుకొచ్చారు. లేదు అంటే రామానాయుడు కళ్యాణ మండపం డీ మాలిష్ చేస్తున్నారని అందులో ఒక ఫ్లోర్ తీసుకోవచ్చని ఏది కావాలో ఛాయిస్ చెప్పాలని విష్ణు అడిగాడని ఆమె చెప్పుకొచ్చారు. అందరూ రామానాయుడు కళ్యాణమండపంలో కావాలని అడగడంతో మా బిల్డింగ్ ఆలస్యం అవుతోందని శైలజ అన్నారు. సినిమాల్లో ఛాన్స్ లు ఇచ్చి మూడు నాలుగు సినిమాల నుంచి తప్పించారని ఆమె చెప్పుకొచ్చారు. పెద్దపెద్ద యాక్టర్లతో కలిసి నేను పని చేశానని మలక్ పేట శైలజ వెల్లడించడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి