ఈ వేదికపై పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో ఎలాగైనా తనకు ఓట్లు వేసి గెలిపించాలని, తనని అసెంబ్లీకి పంపించాలని ఒక్కసారిగా ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలి అంటూ అభిమానులను ప్రజలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రముఖ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించి తన స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే వర్మ సోషల్ మీడియా వేదిగా స్పందిస్తూ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకొని ఒక్క ఛాన్స్ అంటూ అడుక్కుంటున్నారు. ఆయన హీరోయిజం కాస్త జీరోయిజం అవుతోంది అంటూ వర్మ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే వర్మ ఇటీవల నారా లోకేష్ పై కూడా విమర్శలు చేసిన విషయం మనకు తెలిసిందే. లోకేష్ రాయలసీమలో పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా నేలను నమస్కరిస్తూ ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆస్కార్ అవార్డు లోకేష్ కు ఇవ్వాలి అంటూ కామెంట్ చేశారు. అయితే వర్మ మాత్రం పవన్ లోకేష్ ను టార్గెట్ చేసే ఇలా కామెంట్ చేస్తున్నారంటూ వీరి అభిమానులు వర్మపై మండిపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి