ఇక నేటి జనరేషన్ హీరోలలో నెంబర్ వన్ స్టార్ గా కొనసాగుతున్నాడు విజయ్. అయితే గత కొంతకాలం నుంచి హీరో విజయ్ ఎలక్షన్లోకి అడుగుపెట్టబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక హీరో విజయ్ కి సంబంధించిన ఒక వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఇటీవలే ఒక స్కూల్ ఫంక్షన్ లో హాజరైన విజయ్ ఇక అక్కడ మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించారు. అంతేకాకుండా ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. డబ్బు తీసుకొని కుండా ఓట్లు వేయకూడదని స్టూడెంట్స్ కు పేరెంట్స్ చెప్పాలని.. అంబేద్కర్ పేరియర్ వంటి గొప్ప వారి గురించి స్టూడెంట్స్ తెలుసుకోవాలంటు సూచించాడు.
డబ్బు తీసుకొని ఓటు వేస్తే మన వేలితో మన కంటిని పొడుచుకున్నట్లే అవుతుందంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఇక ఈ మాటలు అటు విజయ్ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారు అన్న వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. రాజకీయాల్లోకి వెళ్లడమే కాదు ఇక విజయ పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు అని ఒక వార్త ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లియో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సంవత్సరమే ఈ సినిమా విడుదల కాబోతోంది. ఆ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ మరో సినిమా చేయబోతున్నాడు. ఇది కంప్లీట్ చేసి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నాడట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి