యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సలార్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సెప్టెంబర్ లో కచ్చితంగా సినిమా వస్తుంది అంటూ చాలా నమ్మకంగా ఉన్నారు.కానీ కొందరు సినిమా ఇండస్ట్రీకి చెందిన మీడియా వారు మాత్రం సినిమా ను సెప్టెంబర్ లో విడుదల చేయడం కష్టం అంటున్నారు. గ్రాఫిక్స్ వర్క్ అనుకున్నంత స్పీడ్ అవ్వడం లేదు. అంతే కాకుండా సినిమా యొక్క షూటింగ్ పార్ట్ ఇంకా చాలానే ఉంది. అంతే కాకుండా ఇప్పుడు సినిమా లో నటిస్తున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రమాదానికి గురి అయ్యాడు. సలార్ సినిమా లో ఆయన పాత్ర అత్యంత కీలకం.

అలాంటి నటుడు మలయాళ సినిమా షూటింగ్ లో గాయ పడటం.. ఆయన పార్ట్ షూటింగ్ ఉండటంతో ఎప్పటి వరకు ఆయన షూటింగ్ కు వస్తాడు అనే విషయం లో క్లారిటీ లేదు. మూడు నెలల పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్ లకు హాజరు అయ్యేందుకు అవకాశం లేదు అంటూ వైధ్యులు సూచించారట. దాంతో ఆయన షూటింగ్ కు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. అదే కనుక జరిగితే సలార్ సినిమా షూటింగ్ విషయం లో ఇబ్బందులు తప్పవు. అదే కనుక నిజం అయితే సలార్ సినిమా ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాల్సి రావచ్చు అంటున్నారు. మొత్తానికి సలార్ సినిమా యొక్క షూటింగ్ పృథ్వీరాజ్ సుకుమారన్ వల్ల ఆలస్యం అవ్వడం మాత్రమే కాకుండా కొన్ని గ్రాఫిక్స్ వర్క్ కూడా ఆలస్యం అవ్వడం వల్ల సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సలార్ మేకర్స్ నుండి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా సలార్ అనుకున్న తేదీకి వస్తుందని మేకర్స్ బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: