ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ,డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న చిత్రంపై అభిమానుల చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ అండ్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. కేవలం ఈ సినిమా వర్కింగ్ టైటిల్..BOYAPATIRAPO అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్నారు. టైటిల్ని చిత్ర యూనిట్ తాజాగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.ఈ టైటిల్ని అనౌన్స్మెంట్ చేస్తే ఒక గ్లింప్స్ రెడీ చేస్తున్నామంటూ మేకర్స్ తెలియజేయడం జరిగింది.


ఈ టైటిల్ గ్లింప్స్ జులై మూడవ తేదీన ఉదయం 11:25 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా చిత్ర బృందం ప్రకటించడం జరిగింది.. ఈ చిత్రం గ్లింప్స్ యాక్షన్ తో ఊర మాస్  గా ఉండబోతుందని తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన ఒక పోస్టర్ కూడా అందరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ రామ్ చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. దీంతో ఈసారి ఎలాంటి డైలాగ్ ఉండబోతుందో అంటూ అభిమానులు సైతం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి కావాల్సిన ఫుల్ ట్రీట్ ఇందులో ఉంటుందని తెలుస్తోంది.


ఇందులో ఒక కీలకమైన పాత్రలో సాయి మంజరేకర్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.ఈ చిత్రం కోసం రామ్ చాలానే కష్టపడుతున్నారు ఈ క్రమంలోనే కాస్త బరువెక్కి మరి గడ్డం పెంచినట్టుగా తెలుస్తోంది ముందుగా ఈ సినిమాని అక్టోబర్లో రిలీజ్ చేయాలనుకున్న చిత్ర బృందం దాన్ని పోస్ట్ ఫోన్ చేస్తే సెప్టెంబర్ 15కి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. మరి రామ్ ఈ సినిమాతో అభిమానులను మెప్పిస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: