
తెలుగులో కాజల్ ఇప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ప్రస్తుతం బాలయ్య సినిమాలో కాజల్ నటిస్తోంది. మరొకపక్క లేడి ఓరియంటెడ్ చిత్రమైన సత్యభామ సినిమాలో కూడా నటిస్తోంది ఇటీవల సత్యభామ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగానే ఆకట్టుకుంది. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల వెకేషన్ లకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది కాజల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ జాలి ట్రిప్పు కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
షిప్పులో టీ షర్టు జీన్స్ వేసుకొని కాజల్ ఫుల్ ఎంజాయ్ మూడ్ లో ఉన్నట్టుగా పలు రకాల ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ టర్కీలో ఉన్నట్లు తెలుస్తోంది.అక్కడ బీచ్ లో నేచర్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. సినిమాల విషయానికి వస్తే శంకర్ డైరెక్షన్లో ఇండియన్-2 సినిమాలో నటిస్తోంది వీటితోపాటు బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తోంది కాజల్ తిరిగి మళ్లీ పలు సినిమాలతో బిజీ అవ్వాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. అందుచేతనే కాజల్ అగర్వాల్ సరైన కథలను ఎంపిక చేసుకుని ప్రేక్షకులను మెప్పించడానికి సన్నాహాలు చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి