తెలుగు సినీ ప్రేమికులు ఈ మధ్య కాలం విడుదలకు రెడీగా ఉన్న సినిమాలలో ఖుషి సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు పెరగడానికి ప్రధాన కారణం ఈ సినిమా సంగీతం అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి నాలుగు పాటలను విడుదల చేయగా ఆ నాలుగు పాటలు కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగి పోయాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా లోని 5 వ పాట విడుదలకు రెడీ అయింది. అందులో భాగంగా ఈ మూవీ లోని 5 వ సాంగ్ అయినటువంటి "ఓసి పెళ్ళామా" సాంగ్ ను ఈ రోజు అనగా ఆగస్టు 26 వ తేదీన విడుదల చేయనుంది. అందులో భాగంగా ఈ మూవీ లోని "ఓసి పెళ్లామా" అంటూ సాగే ప్రోమో సాంగ్ ను ఈ మూవీ బృందం నిన్ననే విడుదల చేసింది. 

ఇకపోతే ఈ ప్రోమో సాంగ్ ను తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ ప్రోమో సాంగ్ కి తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ ప్రోమోకు వచ్చిన రెస్పాన్స్ ను బట్టి చూస్తే ఈ సాంగ్ కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా ... సమంత హీరోయిన్ గా నటించింది. శివా నర్వాన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ సినిమాకు వాషిం అబ్దుల్ వహేబ్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 1 వ తేదీన వరల్డ్ వైడ్ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్న ఈ మూవీ  బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: