సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైనప్పటి నుంచి దుమ్ము దులిపేస్తోంది..ఆగస్టు 10వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ అదే దూకుడుతో ముందుకు వెళ్తోంది..ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో రోజురోజుకీ జైలర్ సినిమా కలెక్షన్స్ ని పెంచుకుంటూ పోతుంది. ఏ సినిమా కూడా జైలర్ సినిమా పైన ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి. తాజాగా ఈ సినిమా ఇండియన్ చరిత్రలోనే ఒకసారి కొత్త రికార్డును సృష్టించినట్లు తెలుస్తోంది.


ఏకంగా నాలుగు రాష్ట్రాలలో రూ .50 కోట్ల క్లబ్బులో చేరి నాన్ సీక్వెల్ సినిమాల కేటగిరిలో భారీ కలెక్షన్ సాధించిన చిత్రంగా మొదటిసారి ఒక సరికొత్త రికార్డును సృష్టించినట్లు తెలుస్తోంది.. ఏపీ ,తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కేరళ ఒక్కో రాష్ట్రం నుంచి రూ .50 కోట్లు సులువుగా రాబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ ఘనత కేవలం బాహుబలి-2, kgf-2 వంటి సినిమాలకు మాత్రమే సాధ్యమైంది. అయితే ఇది సీక్వెల్ కేటగిరిలో జైలర్ సినిమా మాత్రం కేవలం మొదటి భాగానికి బాక్సాఫీస్ వద్ద ఇలాంటి రికార్డులను సృష్టించడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.


సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కు సింగర్ అనిరుద్ కి సైతం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం రూ .600 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లలో ఈ సినిమా దూసుకుపోతోంది. గతంలో రజనీకాంత్ నటించిన దర్బార్ , కాలా ,పేట వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో రజనీకాంత్ ఇమేజ్ పైన మార్కెట్ పైన చాలా తీవ్రమైన ప్రభావం చూపించింది అనే వార్తలు వినిపించాయి కానీ ఈ సమయంలో బయ్యర్లు కూడా చాలా ఇబ్బందులు పడ్డ సన్నివేశాలు ఉన్నాయట తాజాగా జైలర్ సినిమా విజయంతో అలాంటి రూమర్లన్నీటికి కూడా చెక్ పెట్టిందని చెప్పవచ్చు.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పలు విజయాలను అందుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: