పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ సినిమాలో రెండవ హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో రెండవ హీరోయిన్ గా ఏజెంట్ , గాండీవదారి అర్జున సినిమా లలో హీరోయిన్ గా నటించినటువంటి సాక్షా వైద్య ను తీసుకునే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు వార్త వైరల్ అవుతుంది. 

ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కొంత కాలం క్రితమే ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఓ చిన్న వీడియోను కూడా విడుదల చేసింది. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కూడా ఈ మూవీ బృందం ఓ పోస్టర్ ను విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. సెప్టెంబర్ 5 వ తేదీ నుండి ఈ సినిమా యొక్క కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఓ ఫోటోను తమ సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేశారు. ఇందులో హరీష్ శంకర్ ఉన్నాడు. అలాగే అతని ముందు అనేక కత్తులు , గొడ్డళ్లు  , మారనాయుధాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ బృందం వారు ఈ ఫోటోకి రేపటి నుండి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యొక్క యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించబోతున్నాం అని పేర్కొన్నారు. ఈ యాక్షన్స్ సన్నివేషం అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: