తమిళ నటుడు విశాల్ తాజాగా మార్క్ ఆంటోనీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా ... జీ వీ ప్రకాష్ కుమార్మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాలో ప్రముఖ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ కే సూర్య ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 15 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను మరియు పాటలను కూడా విడుదల చేసింది. ఇకపోతే వీటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంది. 

అలా ఈ మూవీ ట్రైలర్ సూపర్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా పెరిగి పోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 10 వ తేదీన సాయంత్రం 6 గంటలకు "జే ఆర్ సి" కన్వెన్షన్ , ఫిలిం నగర్ , హైదరాబాదు లో నిర్వహించనున్నట్లు దీనికి టాలీవుడ్ యువ నటుడు నితిన్ ముఖ్య అతిథిగా విచ్చేయునున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే విశాల్ ఆఖరుగా లాఠీ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి మార్క్ ఆంటోనీ సినిమాతో విశాల్ ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: