తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ వయసులో కూడా మాస్ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ అభిమానులకు మంచి మాస్ సినిమాలను అందిస్తున్నారు. ఇక ఈయన తోటి హీరోలు కలెక్షన్ల కోసం పరిగెడుతుంటే. బాలకృష్ణ మాత్రం సాదాసీదా గానే సినిమాలు తీస్తూ కలెక్షన్లతో రికార్డు సృష్టిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆయన స్టామినా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు రాజకీయాలలో కూడా క్రియాశీలకంగా పనిచేస్తున్న బాలయ్య.. ఇటీవలే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా అరెస్టు చేయడంతో ఇప్పుడు పార్టీ యొక్క పూర్తి బాధ్యతలను ఆయనే తీసుకున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అనిశ్చితి కారణంగా ఆయన నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాను విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ , శ్రీ లీల కీలకపాత్రలు పోషిస్తూ.. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు రెట్టింపు అయ్యాయనే చెప్పాలి. సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచడమే కాదు బాలయ్య అభిమానులకు ఈసారి మరొక సూపర్ హిట్ మూవీ లభించబోతుందని అర్థమవుతుంది.
ఇక సినిమా విడుదల అక్టోబర్ 19న ఉంటుందని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాజకీయ పరిణామాల కారణంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని.. వార్తలు వచ్చినప్పటికీ ఇందులో ఎటువంటి మార్పు ఉండదని చిత్ర బృందం స్పష్టం చేసింది. ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ పూర్తి చేసి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ప్రోగ్రెస్‌లో ఉన్నందున షూటింగ్ త్వరలో పూర్తవుతుందని కూడా సమాచారం. ఏది ఏమైనా బాలయ్య ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోబోతున్నారని చెప్పవచ్చు ఇక ఈ విషయం అభిమానులకు మంచి కిక్ ఇచ్చే వార్త అనడంలో సందేహం లేదు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి