మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్ నివాసంపై 2011 లో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసినప్పుడు ఏనుగు దంతాలతో తయారు చేసిన కొన్ని వస్తువులు బయటపడ్డాయి. దీంతో కేరళ అటవీ మరియు వన్యప్రాణి విభాగం అటవీ చట్టం కింద మోహన్‌లాల్‌పై కేసును నమోదు చేసింది. ఆ తర్వాత 2019లో, ఎర్నాకులంలోని మెక్కప్పల్ ఫారెస్ట్ స్టేషన్ కూడా మోహన్‌లాల్‌ పై కేసు నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేస్ పెరంబూర్ మేజిస్ట్రేట్ కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ మోహన్‌లాల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వచ్చే ఆరు నెలల పాటు మోహన్ లాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని  ఆదేశించింది.దీంతో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ఇద్దరు తమను అభియోగాల నుంచి విముక్తి చేయాలని సమర్పించిన పిటిషన్లను విచారణకు అంగీకరించింది.దీనితో ఏనుగు దంతాలు అక్రమ సేకరణ కేసులో మోహన్ లాల్‌కు కాస్త ఊరట లభించింది.

మోహన్ లాల్ సినిమాలతో పాటుగా వ్యాపార రంగంలో కూడా బాగానే రాణిస్తున్నారు. ఫిషింగ్, బోటింగ్‌, రియల్ ఎస్టేట్ మరియు బంగారం వ్యాపారం, దుబాయ్‌లో రియల్ ఎస్టేట్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్స్‌లో  కూడా ఆయన పెట్టుబడులు కూడా పెట్టారు.దీనితో మోహన్ లాల్ పై పలు సార్లు ఐటీ దాడులు కూడా జరిగాయి.అయితే కొన్ని నెలల క్రితం ఒక కేసు విషయంలో మోహన్‌లాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులను జారీ చేసింది. కేరళకు చెందిన మోసగాడు మోన్సన్ మవున్‌కల్‌తో సంబంధం ఉన్నాయంటూ ఈడీ ఆయనకు నోటీసులను ఇచ్చింది. మోహన్ లాల్ ను విచారణకు కూడా పిలిచారు. మోన్సన్ మావుంకల్ తన వద్ద పురాతన వస్తువులు ఉన్నాయని నమ్మించి పలువురి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. మనీలాండరింగ్ కేసులో మోన్సన్ మావుంకల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అతడిని విచారించగా మోహన్‌లాల్‌తో సంబంధాలు ఉన్నట్లుగా వారికీ తెలిసింది.దీంతో మోహన్‌లాల్‌కు నోటీసులిచ్చి విచారణకు హాజరుకావాలని అయితే సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: