తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ నటులలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఇకపోతే ఈయన ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత మీటర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొన్నాడు. ఇకపోతే ఈ సంవత్సరం రూల్స్ రంజన్ అనే మరో మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇకపోతే ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... రత్నం కృష్ణమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాను సెప్టెంబర్ 28 వ తేదీన కాకుండా అక్టోబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అక్టోబర్ 3 వ తేదీన నిర్వహించాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

అందులో భాగంగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని నిర్మిస్తున్న ఏ ఎం రత్నం ప్రస్తుతం పవన్ తో హరిహర వీరమల్లు మూవీ ని నిర్మిస్తూ ఉండడం తో రత్నం గారు పిలిచినట్లయితే పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: