
ఇక తర్వాత ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన అభినేత్రి సినిమాలో కీలక పాత్రలో పోషించినా..ఈ సినిమా కూడా ఈమెకు పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఎన్ని సినిమాలలో అవకాశాలు వచ్చిన సరే వాటిని సద్వినియోగం చేసుకున్నా.. సక్సెస్ మాత్రం ఈమెను వరించలేదని చెప్పాలి. దీంతో ట్రేడ్ వర్గాలు కూడా ఈమె కెరియర్ ముగిసిపోయిందనే కామెంట్లు చేస్తున్నాయి. సాధారణంగా హీరోయిన్లు కెమెరా కళ్ళల్లో పడాలి అంటే సినిమా ప్రమోషన్స్ కి మించిన ఆప్షన్ మరొకటి ఉండదు. బయటకి వచ్చారంటే చాలు తమ టాలెంట్ మొత్తం చూపిస్తూ ఉంటారు.ఈమె ఇదే ఫాలో అవుతోంది. బయట కూడా గ్లామర్ షో చేస్తూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
మొన్నటికి మొన్న రవితేజ ఖిలాడి చిత్రంలో నటించి తన అందాలతో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె తన అందచందాలతో గ్లామర్ షో తో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది. ఎద అందాలను చూపిస్తూ రచ్చ చేసిన ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాని కూడా ఊపేస్తోందని చెప్పాలి. ఇకపోతే అందం విషయంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఈమెకు గుర్తింపు ఉన్నప్పటికీ కూడా తెలుగులో, హిందీలో అవకాశాలు వస్తున్నా కూడా ఒక్క విజయం కూడా ఆమె ఖాతాలో చేరడం లేదు. మునుముందు కూడా ఇలాగే జరిగితే ఈమెకు అవకాశాలు రావడం కూడా కష్టమే అవుతుందని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.