
ఈ ఫోటో రూపకర్త మరెవరో కాదు ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ శ్రీనివాస్ మోహన్. ఈయన గతంలో టు ఓ, బాహుబలి ది బిగినింగ్, రోబో, ఆర్‌ఆర్ఆర్ లాంటి ఎన్నో భారీ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ పర్యవేక్షకుడుగా వ్యవహరించాడు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇల్యూషన్ టూల్స్ సహాయంతో సముద్రపు తీరాన పడవలు.. ఆకాశం తో ఎన్టీఆర్ చాయ కనిపించే విధంగా ఈ పిక్ని తీర్చిదిద్దాడు. సోషల్ మీడియా వేదికగా ఈ పిక్ షేర్ చేయగా నిమిషాల్లోనే లక్షల్లో లైక్స్ సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాలశివ కాంబోలో దేవర సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
సముద్రతీరం బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాలో తీసిన ఓ సంబంధిత లొకేషన్ పిక్ ను ఏఐ సాంకేతికత ద్వారా ఎన్టీఆర్ ఫేస్ కనిపించేలా శ్రీనివాస్ మోహన్ క్రియేట్ చేసినట్లు సమాచారం. ఫోటోనే ఇంత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది అంటే ఇంక మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో అనే ఆసక్తి ఎన్టీఆర్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా మొదలైంది. ఇక ఈ సినిమాలో భయం తెలియని వాళ్లకు భయాన్ని చూపించే ఓ శక్తివంతమైన క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నటించబోతున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ వాలన్ రోల్‌లో నటించబోతున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక భారీ హైప్‌తో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎటువంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి.