
నన్ను ఒక నటుడిగా, హీరోగా చేసిందని మనోజ్ చెప్పుకొచ్చారు. రాకింగ్ స్టార్ అనే ఒక పేరు కూడా ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఫ్యాన్స్, విజిల్స్, అరుపులు, కేకలు ఇలా ఒక పండుగలా జరిగిన నా జీవితంలో అకస్మాత్తుగా ఒక ఒక సైలెన్స్ వచ్చిందని మనోజ్ అయిపోయాడని అన్నారని కెరీర్ ఖతం అన్నారని మనోజ్ కామెంట్లు చేశారు. యాక్టింగ్ ఆపేశాడని ఇక తిరిగి రాడని అన్నారని మనోజ్ చెప్పుకొచ్చారు.
ఎనర్జీ స్టార్ లో ఎనర్జీ తగ్గిందని అన్నారని మనోజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ కామెంట్లను విన్నానని చూశానని మౌనంగా భరించానని తిరిగొస్తున్నానని మనోజ్ పేర్కొన్నారు. ఈ టాక్ షోను ప్రముఖ సంస్థలలో ఒకటైన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ షో మనోజ్ కెరీర్ ను ఏ స్థాయిలో మలుపు తిప్పుతుందో చూడాల్సి ఉంది. ఈ టాక్ షోతో మనోజ్ సంచలనం సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.