
ఇటీవల ఈ సినిమా థియేటర్లో విడుదలై నెల రోజుల లోపే ఓటీటి లోకి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఖుషి సినిమా అన్ని భాషలలో ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటిటి ఛానల్ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అక్టోబర్ 1 నుంచి స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే ఇంకా వెలుపడలేదు. కానీ ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సమంతకి కూడా సరైన సక్సెస్ లేక చాలా కాలం అవుతున్నప్పటికీ ఖుషి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా కోసం విజయ్, సమంత అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటి లో విడుదలవుతుందా అంటూ ఎదురుచూస్తున్న వారికి ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరి థియేటర్లో మిస్సయిన ప్రేక్షకుల సైతం ఈ సినిమాని ఓటీటి లో చూడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఓటీటి లో ఖుషి సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుంది తెలియాలి అంటే ఈ సినిమా విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే. ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు