తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో శివ కార్తికేయన్ ఒకరు. ఇకపోతే ఈయన ఇప్పటికే తమిళ్ లో ఎన్నో విజయాలను అందుకొని కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈయన తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో విడుదల చేసి అందులో కొన్ని మూవీ లతో అద్భుతమైన విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంతో ఈ నటుడి కి తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

ఇకపోతే తాజాగా ఈ నటుడు మా వీరన్ అనే తమిళ సినిమాలో హీరోగా నటించాడు. మడోనే అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... సునీల్ , యోగిబాబు ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు. తెలుగు లో ఈ సినిమాను మహా వీరుడు పేరుతో విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా మంచి అంచనాలు నడుమ తమిళ , తెలుగు భాషల్లో ఒకే రోజు విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకొని మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది.

ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా ఇప్పటికే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాను ఈ సంస్థ వారు తమ చానల్లో ప్రసారం చేయనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk