
ఇక ప్రభాస్ నటించిన సలార్ సినిమా కూడా ప్రస్తుతం పోస్టుపోన్ అయ్యి డిసెంబర్ 22వ తేదీన ఈ ఏడాది విడుదల చేసేందుకు చిత్ర బృందం నిన్నటి రోజున అధికారికంగా ఒక కొత్త డేట్ ని ప్రకటించారు. దీంతో చాలా సినిమాలు ఇబ్బంది పడేలా కనిపిస్తున్నాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. డిసెంబర్ నుంచి జనవరి వరకు చాలా పెద్ద పెద్ద సినిమాలు విడుదల తేదీలను ప్రకటించడం జరిగింది. గతంలో స్టార్ హీరోల సినిమాలకు చిన్న సినిమాలతో పోటీ ఎందుకని తప్పుకునేవారు కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
సలార్ సినిమా డిసెంబర్ 22న వస్తూ ఉండడంతో డిసెంబర్లో విడుదలయ్యే సినిమాలు సంక్రాంతికి షిఫ్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే పలు రకాల సినిమాలు డేట్లు కన్ఫామ్ చేసుకోగా ఇప్పుడు చిన్న సినిమా అయినా హనుమాన్ కూడా జనవరి 12న రాబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమా ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తుండడంతో ఈసారి మాత్రం అసలు తగ్గేదే లేదంటూ మేకర్స్ తెలియజేస్తున్నారు. సంక్రాంతి నుంచి తప్పుకోవాలని కొంతమంది నిర్మాతలు అడిగిన కూడా తాము పక్కకి తప్పుకోవడాలు లేవంటూ డైరెక్టర్ నిర్మొహమాటంగా తెలియజేసినట్లు తెలుస్తోంది.మరి ఏ సినిమాలు ఏ డేట్ లకు వస్తాయో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.