భారీ అంచనాల మధ్య ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్నో ట్విస్టులు ఇక ఈ సీజన్లో ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు. అయితే ఎప్పటిలాగానే బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది అని చెప్పాలి. ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో సింగర్ దామిని ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే కిరణ్ రాథోడ్ ను పక్కన పెడితే షకీలా, దామిని స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని.. వాళ్లని ఎలిమినేట్ చేయడం ఏంటి అని కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇలా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లలో ఎవరో ఒకరూ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అన్న వార్త కూడా వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం 11 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు ఎలిమినేషన్లు అంటూ రచ్చ కొనసాగుతుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో నాలుగో వారం ఎలిమినేషన్ కు రంగం సిద్ధమైంది. కాగా ఈ వారం నామినేట్ అయిన వారిలో ప్రిన్స్ యావర్ అత్యధిక ఓట్లు సాధించి టాప్ లో ఉన్నాడు. తర్వాత శుభశ్రీ 19% ఓటింగ్ తో రెండవ స్థానంలో ఉండగా.. ప్రియాంక 15% ఓటింగ్ తో మూడో స్థానంలో ఉంది. గౌతమ్ 15% ఓటింగ్ తో నాలుగో స్థానంలో ఉండగా.. చివరి రెండు స్థానాల్లో రతిక, టేస్టీ తేజ నిలిచారు అని చెప్పాలి. అయితే ఇక ఈ ఎలిమినేషన్ సంగతి పక్కన పెడితే బిగ్ బాస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తొలిసారి రెడ్ కార్డు చూపించి ఒక కంటెస్టెంట్ ని బయటికి పంపించబోతున్నారట. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు టేస్టీ తేజ. స్మైల్ టాస్క్ లో భాగంగా డాక్టర్ గౌతం కృష్ణ తో టేస్టీ తేజ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. శారీరక హింసకు పాల్పడినటువంటి టేస్టీ తేజకు రెడ్ కార్డు షో చేసే అవకాశం ఉందనేది తెలుస్తుంది. దీంతో సాధారణ ఎలిమినేషన్ తో పాటు రెడ్ కార్ ద్వారా మరో ఎలిమినేషన్ జరగబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయ్. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: