బిగ్ బాస్ 7వ సీజన్ ప్రస్తుతం ఎంతో రసవత్తరంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. సరికొత్త టాస్కులతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు బిగ్ బాస్ నిర్మాతలు. ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో గొడవ పడుతూ ఉండడంతో ఇది చూసి బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా తెగ  ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ ఏడవ సీజన్లో నాలుగవ ఎలిమినేషన్ కు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఇక ఇప్పటివరకు జరిగిన మూడు ఎలిమినేషన్స్ లో అటు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొదటి ఎలిమినేషన్ లో కిరణ్, రెండో ఎలిమినేషన్ లో షకీలా, మూడవ ఎలిమినేషన్ లో దామిని ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇప్పుడు నాలుగో ఎలిమినేషన్ లో కూడా మరోసారి లేడీ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్ళబోతుంది అని టాక్ వినిపిస్తుంది. దీంతో బిగ్ బాస్ హౌస్ లో అమ్మాయిల సంఖ్యకు అబ్బాయిల సంఖ్యకు ఎంతో తేడా రాబోతుంది అని చెప్పాలి. బిగ్బాస్ సీజన్ లో మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా అందులో ఏడుగురు మగవారు ఏడుగురు ఆడవాళ్లు.


 ఇక ఇప్పుడు మరో లేడీ కంటెస్టెంట్ వెళ్లిపోతే ఇంకా ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ మాత్రమే మిగులుతారు. అయితే రతిక ఈ వారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే రతిక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పటి నుంచి అందంగా ఉంది అనిపించింది తప్ప.. ఇక ఆ బాగా ఆడుతుందని మాత్రం ఎక్కడ అనిపియ్యలేదు. ఇక ఆమె ఓవరాక్షన్ అప్పుడప్పుడు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు అని చెప్పాలి. అంతేకాదు ఇక మంచి పాపులారిటీ ఉన్న పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేసింది. దీంతో ప్రేక్షకుల్లో ఎక్కువగా నెగిటివ్ వచ్చింది. ఇక ఈ కారణాలతోనే రతిక హౌస్ నుంచి బయటకు వెళ్తుంది అన్నది అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: